కెసిఆర్‌, కెటిఆర్‌ దమ్ముంటే కర్ణాటకకు రండి

  • ఐదు గ్యారంటీల అమలును చూపిస్తాం
  •  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌

ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ దమ్ముంటే కర్ణాటక కు రండని ఐదు గ్యారంటీల అమలుని నిరూపిస్తానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సవాల్‌ విసిరారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎం.అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కు మద్దతుగా గాంధీ నగర్‌ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్న కేసీఆర్‌ కేటీఆర్‌ లు నా సవాలను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.

డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలను కచ్చితంగా చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాలకు తన మద్దతును ప్రకటిస్తూ వచ్చిన కేసీఆర్‌, మోడీలు ఒకటేనని ఎద్దేవా చేశారు. రెండుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన అంజన్‌ కుమార్‌ యాదవ్‌ శాసన సభ్యుడుగా మీకు సేవలందించడానికి వచ్చారని ఆయనను ఆశీర్వదిస్తే రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపడతారని డీకే శివకుమార్‌ వెల్లడిరచారు. సభలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎం.అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, తెలంగాణ జన సమితి గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *