ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సభవత్ వినోద్ నాయక్, రాము నాయక్, సాయి నాయక్, సాయి కమార్ నాయక్ లు మైసిగండి గ్రామంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారిని కాంగ్రెస్ పార్టీ కాండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవడానికి వరంగల్ రైతు డిక్లరేషన్, సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్, సోనియాగాంధీ ప్రకటించిన ఐదు గ్యారెంటీ పథకాలకు కు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హీరాసింగ్ నాయక్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జవహర్ లాల్ నాయక్, ఈ కార్యక్రమం లో స్టాలిన్ కిషన్ నాయక్, రాము నాయక్, రమేష్, తులసిరామ్, హీరా, శివ, విజయ్, సుధీర్, చిన్న, పీటర్, సుమన్, వెంకటేష్, చందు మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



