కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 04 : కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లను ప్రజలకు వివరిస్తూ గడపగడపకు ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాలేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం సాధించదని, కాంగ్రెస్ విజయం ఖాయమని తెలిపారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన లభిస్తుందని, కాంగ్రెస్ విజయం తథ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సుమేష్ , దాసరి నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యం సామల శ్రీనివాస్ రెడ్డి





