తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం, నాయకుల నివాళి…
1995లోనే ప్రొ॥జయశంకర్ సార్ తో తెలంగాణ రాష్ట్రం కోసం సమావేశాలు ఏర్పాటు చేసిన నాయకుడు, మలిదశ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెఏసి చైర్మన్ గా గల్లి నుండి దిల్లీ దాకా స్వరాష్ట్ర సాధన పోరాటంలో ప్రొ॥కోదండరాం కు అండగా నిలబడిన కరుడుగట్టిన తెలంగాణవాది ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్షల కోసం పోరాడిన వెదిరె చల్మారెడ్డి అనారోగ్యంతో శుక్రవారం పొద్దున మరణించారు…చల్మ రెడ్డి స్వగృహం రగన్నాగూడకు వెళ్లి ప్రొ .కోదండరాం నివాళులు అర్పించారు…

తెలంగాణ ఉద్యమ సమయంలో రంగారెడ్డి జాక్ నేతగా చల్మ రెడ్డి ఉద్యమాన్ని, తెలంగాణ ఏర్పాటు తరువాత జాక్ లో క్రియాశీలక పాత్రను గుర్తు చేసుకున్నారు.




