ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : కడ్తాల మండలం వంపుగూడ – చల్లపల్లి సాలార్పూర్ గ్రామాల మీదుగా పడకల్ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి గ్రామణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడ్తాల్ నుండి వంపుగూడెం చల్లంపల్లి, సాలర్ పూర్ మీదుగా పడకల్ గేట్ వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కడ్తాల్ టిఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అడగగానే మంజూరు చేసిన కెసిఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. నూతన మండల అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తమ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లచ్చి రామ్ నాయక్, ప్రియా రమేష్ నాయక్, సర్పంచ్ కృష్ణయ్య, ఉప సర్పంచ్ రామకృష్ణ, జైపాల్ రెడ్డి, శారదా పాండు, డైరెక్టర్ సేవ్య నాయక్, లాయక్ అలీ, వెంకటేష్, వార్డ్ సభ్యులు బిక్షపతి, రామచంద్రయ్య, శ్రీను, నాయకులు రాజేందర్ యాదవ్, రమేష్, అంజి, పాండు, వెంకటేష్, జగన్, టిక్ లాల్, శ్రీను పాల్గొన్నారు.




