ఏ ఇంటికి ఆ ఇళ్లే కథానాయకులు అవ్వండి… ప్రజాస్వామ్యాన్ని కాపడండి

మీటింగ్‌కు రాకుండా బిఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు దావత్‌లు ఇస్తుండ్రు..
ప్రపంచం గజ్వేల్‌ వైపు చూస్తోంది
గజ్వేల్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈటల రాజేందర్‌

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ఇప్పుడు ప్రపంచం మొత్తం గజ్వేల్‌ వైపు చూస్తుందనీ, గజ్వేల్‌ ప్రజలందరూ ధర్మాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా గురువారం గజ్వేల్‌కు వచ్చాడు.గజ్వేల్‌కు వచ్చిన ఈటల రాజేందర్‌కు సికింద్రాబాద్‌`సిద్ధిపేట రాజీవ్‌ రహదారినపైన గల వంటిమామిడి నుండి ఈటల రాజేందర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గజ్వేల్‌ పర్యటనలో భాగంగా వర్గల్‌లోని సరస్వతీ దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడుతా…బిజెపి గజ్వేల్‌ అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత మొదటిసారిగా గజ్వేల్‌లో అడుగుపెడుతున్నాననీ, గజ్వేల్‌ ముఖద్వారం అయిన వంటిమామిడిలో ఘన స్వాగతం పలికిన నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానీ అన్నారు. వర్గల్‌లో నేను 10 సంవత్సరాలు ఉన్నాను. ఇక్కడ నా ఇళ్లు, పౌల్ట్రి ఫామ్‌ ఉండేదనీ,  ఈ గుడితో నాకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఏ పార్టీ మీటింగ్‌ వారు పెట్టుకోవచ్చు. కానీ, బిజెపి మీటింగ్‌కు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారనీ రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు  దావతులు ఇచ్చి, పైసలు పంచి ఆపుతున్నారనీ,  ఇదే హుజురాబాద్‌లో కూడా చేశారన్నారు. కానీ, అక్కడ ఈ ప్రలోభాలను, డబ్బు పంపకాలను పాతరవేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించుకున్నారన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుందనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు  కర్రుకాల్చి వాత పెడతారన్నారు. ఈ ఎన్నికల్లో ఏ ఇంటికి ఆ ఇళ్లే కథానాయకులై  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. వేల ఎకరాల భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం గుంజుకున్నారనీ, ప్రయివేట్‌  కంపెనీలకు ఇస్తున్నారన్నారు.  కోటి రూపాయల విలువ ఉన్న భూములు 8 లక్షల రూపాయలకు  గుంజుకుని  రైతులను అడ్డమీద కూలీలుగా చేస్తున్నారన్నారు. ఇక్కడ మహాభారత యుద్ధం జరగబోతుందనీ,  కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతుందనీ, అంతిమ విజయం పాండవులదే, ధర్మానిదే అన్నారు. పెన్షన్‌ ఆపడానికి వారి అబ్బ జాగీరు కాదనీ, గజ్వేల్‌ ప్రజలు ధర్మాన్ని కాపాడి, చైతన్యాన్ని ప్రదర్శించాలని ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాననీ ఈటల రాజేందర్‌ అన్నారు.
బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసమ్మతి నేతలు బిజెపిలో చేరిక…
గజ్వేల్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో, కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్త, అసమ్మతి నేతలు పలువరు ఈటల రాజేందర్‌ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాదాడి జశ్వంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన గజ్వేల్‌`ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, ములుగు మాజీ జడ్పిటిసిలు సింగం సత్తయ్య, సురేష్‌గౌడ్‌, గజ్వేల్‌ ఏఎంసి మాజీ ఛైర్మన్‌ టేకులపల్లి రాంరెడ్డి, తూప్రాన్‌ మండలానికి చెందిన మధుసూదన్‌రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు బిజెపిలో చేరారు. బిజెపిలో చేరిన వారందరికీ ఈటల రాజేందర్‌ కాషాయం కండువాను కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు, జిల్లా బిజెపి అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, బిజెపి సీనియర్‌ నాయకులు ధరం గురువారెడ్డి, యెల్లు రాంరెడ్డి, శంకర్‌ముదిరాజ్‌, ఉడుత మల్లేశం యాదవ్‌, చంద్రారెడ్డి, పేర్ల  శ్రీనివాస్‌,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *