ఉత్తమ ఫుడ్‌ లిస్ట్‌లో ‘హైదరాబాద్‌ బిర్యానీ’కి చోటు

ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గుర్తింపు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌ బిర్యానీ అంటేనే లొట్టలేసుకునే వారు చాలా మందే. అయితే ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇటీవల స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు వచ్చిన ఫుడ్‌లో కూడా హైదరాబాద్‌ బిర్యానీ ఉంది. ఇక తాజాగా, ట్రావెల్‌ గ్లోబల్‌.. ఈట్‌ లోకల్‌ అనే అంశంతో పని చేసే ప్రముఖ పర్యాటక ఆన్‌ లైన్‌ టేస్ట్‌ అట్లాస్‌ ప్రకటించిన ఉత్తమ ఆహార పరదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్‌ బిర్యానీ స్థానం దక్కడ గమనార్హం. అయితే సదరు కంపెనీ వివిధ దేశాలకు చెందిన నగరాలు.. అక్కడి ఫుడ్‌పై సమీక్ష జరిపింది.
పూర్తి సమీక్ష జరిపిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 50 నగరాల్లో మన హైదరాబాద్‌ బిర్యానీ 39వ స్థానం దక్కించుకోగా, ముంబై 35వ స్థానం దక్కించుకుంది. అలాగే ఢల్లీి 56వ స్థానం, చెన్నై 65వ స్థానం, లక్నో 92వ స్థానం దక్కించుకుంది. అలాగే ఈ ఫుడ్‌ జాబితాలో అగ్రస్థానం ఇటలీ వంటకాలు దక్కించుకున్నాయని సదరు కంపెనీ తెలిపింది. మన దేశ ఆహార పదార్థాల్లో పావ్‌ భాజీ, దోశ, వడాపావ్‌, కబాబ్స్‌, పానీపురి, బిర్యానీలను అధికంగా ఇష్టపడుతున్నట్లు ప్రకరటించింది. ఇక ఏదీ ఏమైనా మన హైదరాబాద్‌ విషయానికి వస్తే బిర్యానీకే టేస్ట్‌ ఫుడ్‌ అట్లాస్‌ జై కొట్టిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *