ఈ ‌యేడు యధావిధిగా బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్‌ 27‌ను బ్రహ్మోత్సవాలు
అధికారులతో సక్షించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమల,జూలై1: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 27‌నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో శుక్రవారం ఆయన  సక్ష నిర్వహించారు. కొవిడ్‌ ‌వల్ల రెండేళ్ల పాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించామని వివరించారు.

ఈ ఏడాది యథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్‌ 1‌న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాల సమర్పణకు ఏపీ సీఎంను ఆహ్వానిస్తామని ఈవో వివరించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలు రద్దు చేస్తున్నామని ప్రకటించారు.బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి లేఖలు స్వీకరించామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *