- స్లాట్ ఓపెనింగ్స్ లేక అవస్థలు
- కనీసం 500 రోజులు పడుతుందని వెల్లడి
న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. కొరోనా విజృంభణ తరవాత మూసివేసి ప్రాజెసింగ్ ఇప్పటికీ తెరచుకోలేదు. దీంతో అమెరికా వెళ్లాలనుకున్న వారికి వీసా దొరక్క కష్టాలు పడుతున్నారు. విజిటర్స్ వీసాకు దరఖాస్తు చేసుకున్నోళ్లు స్లాట్ కోసం కనీసం 500 రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా దేశాలు కరోనా ఆంక్షలను సడలిస్తుండడం, అంతర్జాతీయ విమాన సర్వీసులను మొదలు కావడంతో చాలా మంది భారతీయలు విదేశాల్లో పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో యూఎస్ వీసాకోసం విపరీతంగా అప్లికేషన్లు వస్తున్నాయి. దీంతో ప్రాసెసింగ్‌కు టైం పడుతోందని అధికారులు చెప్తున్నారు. విజిటర్స్ వీసా రావాలంటే దాదాపు ఏడాదిన్నర పడుతోందని యూఎస్ విదేశాంగ శాఖ అధికారులు చెప్తున్నారు. న్యూఢిల్లీలోని యూఎస్ కాన్సులేట్‌లో విజిటర్ వీసా కోసం అపాయింట్ మెంట్ కావాలంటే 582 రోజులు ఆగాల్సి వస్తోంది. ఇలాగైతే అమెరికాలో తమవారిని చూడడానికి వెళ్లగలమా అన్న సందేహం కలుగుతోంది. అలాగే స్టూడెంట్ వీసాకు 471 రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది.
ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో విజిటర్ వీసా అపాయింట్‌మెంట్‌కోసం పట్టే యావరేజ్ వెయిటింగ్ టైమ్517 రోజులు కాగా స్టూడెంట్ వీసాకు 10 రోజులు. విజిటర్ వీసా కోసం హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లో యూఎస్ వీసా అపాయింట్మెంట్కు పట్టే యావరేజ్ వెయిటింగ్ టైమ్ 518 రోజులుకాగా.. స్టూడెంట్ వీసాకు 479 రోజులు. విజిటర్ వీసా కోసం కోల్‌కతాలోని యూఎస్ కాన్సులేట్ అపాయింట్మెంట్కు 587 రోజులు కాగా, స్టూడెంట్ వీసాకు 2 రోజులు. చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌లో విజిటర్వీసా కోసం యావరేజ్వెయిట్ టైమ్513 క్యాలెండర్ రోజులు, స్టూడెంట్ వీసాకు 8 రోజులు పట్టనుంది. లాక్డౌన్? కారణంగా ప్రపంచవ్యాప్తంగా వీసా సర్వీసులకు ఆటంకం కలిగిందని లిబరేషన్ క్యాటో ఇన్స్టిట్యూట్లో ఇమిగ్రేషన్ పాలసీ అసోసియేట్ డైరెక్టర్ డేవిడ్ బెయిర్తెలిపారు. కొవిడ్ సమయంలో వీసా కార్యకలాపాలు ఆగిపోయాయని, ఇపుడు కొవిడ్ ఆంక్షలను సడలించడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక్క అమెరికానే కాకుండా యూకే, కెనడా వంటి దేశాలకు కూడా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్‌కు చాలా టైమ్పడుతోంది. ఉదాహరణకు యూకేలో వీసా ప్రాసెసింగ్టైమ్కు నాలుగు నుంచి పది వారాలు పడుతోంది. ఇక జర్మనీ పర్మనెంట్ స్టే వీసాలను తీసుకోవడం ఆపేసింది.
షార్ట్‌స్టే వీసాలు, రెసిడెన్స్పర్మిట్లకు అప్లికేషన్లను తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేశామని ఈ ఏడాది మే 30న ఇండియాలో డానిష్ఎంబసీ ప్రకటించింది. అయితే గత నెల 6న ఈ అప్లికేషన్లను తీసుకోవడం మళ్లీ ప్రారంభించింది. స్పాన్సర్డ్ వర్క్ రూట్స్, స్టూడెంట్ వీసాల పథకం కింద వచ్చే దరఖాస్తుల కోసం స్టార్ట్ ద ప్రయారిటీ వీసా (పీవీ), సూపర్ ప్రయారిటీ వీసా సేవలను యూకే త్వరలోనే పున:ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో వచ్చే కొద్ది వారాల్లో భారీ సంఖ్యలో అప్లికేషన్లు రావొచ్చని, తమ దరఖాస్తులను వీలైనంత త్వరగా అందజేయాలని స్టూడెంట్లకు ఇండియాలోని బ్రిటిష్ హై కమిషన్ సూచించింది. ‘యూకేకు వెళ్లేందుకు 15 రోజుల్లోనే చాలా మందికి వీసాలు వస్తున్నాయి. ఇందుకు కరోనా తర్వాత యూకే వీసాలకు విపరీతమైన డిమాండ్, రష్యా-ఉక్రెయిన్- యుద్ధమే ఇందుకు కారణం అని ట్విట్టర్లో యూకే హైకమిషనర్ ఎలిస్ చెప్పారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్లను మళ్లీ తెరవడంతో విదేశీ పర్యటనకు డిమాండ్ ఏర్పడిందని వీసా ఏజెన్సీ వీఎఫ్ఎస్ గ్లోబల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొవిడ్ టైమ్‌లో ఇండియాకు తిరిగివచ్చినన స్టూడెంట్లు, వర్కింగ్ప్రొఫెషనల్స్ మళ్లీ ఆయా దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో భారీగా వీసా అప్లికేషన్లు వస్తున్నాయి. వీటిని ప్రాసెస్చేసేందుకు ఎక్కువ టైమ్పడుతోందని తెలిపారు.




