అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 :  అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో  నిర్వహిస్తున్న సమ్మె 3 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26, వేలను ఇవ్వాలని పెన్షన్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు హెల్పర్స్ కు రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు నిర్ణయించాలని, ఇలా 25 ప్రధానమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వము ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ ఉద్యోగుల పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుందని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించేలా సహకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు అనసూయమ్మ, పద్మ, అలివేలు, రాజ్యలక్ష్మి, సంధ్య, లక్ష్మమ్మ, శాంతమ్మ, కే. అలివేలు, రజిత, నాగశిరోపాణి, స్వరూప, సువర్ణ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *