యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ (Youth Congress ) నాయకులకు 20శాతం స్థానాలను కేటాయించాల ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈమేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్ ను కలిశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన చారిత్రా త్మక మద్దతుకు, చూపిస్తున్న నాయకత్వానికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ట ముఖ్యమంత్రి చూపుతున్న నిబద్ధత లక్షలాది మంది యువతకు ప్రేరణగా నిలుస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో ప్రతి కార్యక్రమంలో కూడా యూత్ కాంగ్రెస్ క్రమశిక్షణతో నిలబడి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేకూర్చే విధంగా కృషి చేశారని గుర్తుచేశారు.. వారి ఈ కృషికి గుర్తింపుగా, కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వాన్ని ఎదిగించాలన్న లక్ష్యానికి అనుగుణంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 20% స్థానాలను యువ కాంగ్రెస్ నాయకులు, సభ్యులకు కేటాయించాలని కోరారు. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా, కొత్త ఆలోచనలు, యువ శక్తిని స్థానిక పాలనలో తీసుకురావచ్చని అన్నారు. ఇది యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించి, యువతను ముందుకు నడిపంచాలని కోరారు. యూత్ కాంగ్రెస్ పూర్తి బాధ్యతతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు.




