ప్రపంచ దేశాలను ఏకం చేసిన యోగా

విశాఖలో జరిగిన యోగా డేలో ప్రధాని మోదీ

విశాపట్నం : అంతర్జాతీయ యోగా వేడుకలు విశాఖపట్టణఱంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని అందరికీ శుభాకాంక్షలు అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యోగా ప్రంచ దేశాలను ఏకం చేసింది.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇచ్చాయి.. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణత విషయం కాదు.. గత పదూఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామగ్రామాన యువకులు యోగాను అనుసరిస్తున్నారు.. దీనికి వయసుతో పనిలేదు.. హద్దులు లేవు‘ అని అన్నారు. ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి చిరునామా విశాఖపట్నం.. ప్రకృతిలో మనిషి భాగస్వామి అని యోగా గుర్తు చేస్తుంది.. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది.. యోగా వల్ల స్థిరత్వం పొందొచ్చు‘ అని తెలిపారు. ‘యోగా కేవలం వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం.. ఈసారి విఖలో యోగ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది‘ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధానికి స్వాగతం పలికిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. సీఎం చందబ్రాబు తన ప్రసంగంలో విశాఖలో జరుగుతున్న నేటి యోగా దినోత్సవం ష్టించబోతోఏంది.. శుక్రవారం 22వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డు సాధించారని పేర్కొన్నారు. రోజూ గంట సేపు యోగా చేస్టేమంచి ఫలితాలు ఉంటాయన్నారు. శరీరం, మనసు, ఆత్మ కలయికే యోగా అన్నారు. ఈ కార్యక్రమంలో 3 లక్షల మందికిపైగా పాల్గొన్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రసంగించారు. ప్రసంగాల అనంతరం ప్రధాని మోదీ, సీఎం చంబ్రాబు, మంత్రులు యోగాసనాలు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *