యాద‌గిరిగుట్ట ఆలయ క్షేత్రానికి ప్ర‌త్యేక‌ మాస ప్ర‌తిక‌, టీవీ ఛానల్‌

  • రూ.5వేల‌తో గ‌రుడ టికెట్
    యాద‌గిరి క్షేత్ర ఈఓ వెంక‌ట్రావు వెల్ల‌డి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర : యాదగిరిగుట్ట దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసేందుకు వీలుగా హిందూ ధర్మంపై విస్తృతమైన ప్రచారం జరపాలని ఇందుకుగాను వైటిడిఏ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించినట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆల‌య (Yadagirigutta Temple ) ఈఓ వెంక‌ట్రావు తెలిపారు. ఆలయ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ త్వరలోనే టీవీ ఛానల్ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మాస పత్రికలో హిందూ ధర్మం ప్రకారం అనేక విషయాలను తెలుగులో ప్రచూరిస్తామ‌న్నారు. భక్తులకు సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్టు తరహాలో ఈ దేవస్థానం లో స్వామి వారిని త్వరగా దర్శించుకునేందుకు వీలుగా ఒక భక్తునికి రూ.5000 రూపాయల తో గరుడ టికెట్ అందుబాటులోకి తేనున్నట్లుగా తెలిపారు. ఈ గరుడ టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు కొండ కింది నుంచి కొండపైకి వచ్చే వాహనం టికెట్ స్వామివారి గర్భాలయ ప్రవేశం ఒక చెల్లా ఒక రవిక కనుము 5 లడ్డు ప్రసాదం ఒక కేజీ పులిహోర తోపాటు వేద ఆశీర్వచనం ఈ ప్యాకేజీ ద్వారాకల్పించనున్నట్లు తెలిపారు. ఈ టికెట్టు కొను గోలు చేసిన భక్తుడు ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ మధ్యలో భక్తుల వీలుకు అనుగుణంగా ఏదైనా ఒక సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం వుంటుంద‌ని తెలిపారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ అనుమ తి వచ్చిన అనంతరం గరుడ టికెట్టును ప్ర‌వేశ‌ పెడ‌తామ‌న్నారు. ప్రతి సంవత్సరం ఆలయానికి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు కరెంటు బిలులు చెల్లించినప్పటికీ విద్యుత్ అంతరాయం క‌లుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ ని అభివృద్ధి చేయాల‌న్న‌ ఉద్దేశంతో నాలుగు మెగావాట్ల ఎనర్జీ. నాలుగు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను రూ.20 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకుగాను టీఎస్ రెడ్ కో వారి సలహా ప్రకారం తెలంగాణలో ఎక్కడా లేని విధంగా డిపిఆర్ డెవలప్ చేసి పంపారని దీనిపై ప్రభుత్వానికి అనుమతులు కోసం ప్రతిపాదనలు పంపిస్తూ కచ్చితంగా ఒక సంవత్సరంలోపు ప్రారంభిస్తామ‌న్నారు. స్వామి వారి కొండ క్రింద చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్డులో ఉన్నటువంటి ఐదు సర్కిల్స్ లో ఐదు విగ్రహాలు నిర్మాణానికి సుమారు రూ. 3.6 కోట్లు ఖర్చవుతుందని ఈ నిర్మాణానికి దాతల సహాయం కోరుతున్నట్లుగా తెలిపారు దాతలు ముందుకు రాని సమయంలో ఆల‌యం ద్వారా ఈ నిర్మాణాలని విడతలవారీగా నిర్మిస్తామని తెలిపారు. ఈ ఐదు సర్కిల్లో ఐదు విగ్రహాలు ఒకటి 70 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, గరుడ విగ్రహం, ప్రహ్లాద విగ్రహం, రామానుజ విగ్రహం, యాద రుషి విగ్రహాలను నిర్మించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *