యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఈఈ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకి బుధవారం పట్టుబడ్డారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర రూ.1.90 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన పలు ఆస్తులతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు ఇప్పటికే పలుమార్లు అవినీతి ఆరోపణలతో సస్పెండయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



