టిటిడి అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌

తిరుమల, ప్రజాతంత్ర, జూలై 3: జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని విమర్శించారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మణ్‌ విూడియాతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురిచేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *