– ఆడపడుచులకు సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొంటూ రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలతో తయారు చేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడ బిడ్డలందరూ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు, తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని అన్నారు. ఈ పండుగ ప్రజల సాంస్కృతిక వైభవం, మహిళల ఐక్యతను చాటి చెప్పడంతోపాటు అనేక సామాజిక అంశాలతో నిండి ఉందన్నారు. ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు రాష్ట్రమంతటా అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారన్నారు. బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడానికి, సరూర్‌నగర్ స్టేడియంలో పదివేల మంది మహిళలతో ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించిందని సీఎం అన్నారు. ప్రకృతి పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, చెరువులు, కుంటలను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిస్తుందని, అందుకే బతుకమ్మ చెరువును పునరుద్దరించామని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





