– మహిళా కమిషన్‌ఆధ్వర్యంలో కార్యక్రమం
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: నవరాత్రి,బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ళ శారద అధ్యక్షతన బుద్ధభవన్‌లో ’మాతృత్వం మరియు ఆరోగ్యం’ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కార్యదర్శి మాట్లాడుతూ మాతృత్వం, మహిళల ఆరోగ్యం, అలాగే మహిళా కమిషన్ అందిస్తున్న సేవల గురించి వివరించారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్,నేరెళ్ళ శారద మేడమ్ బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యతను, మహిళల ఆరోగ్యం పట్ల తీస్కోవాల్సిన జాగ్రత్తలు మహిళలకు తెలియజేశారు. హైడ్రా కమిషనర్, రంగనాథ్ మాతృత్వంలో ఆహారపు అలవాట్లు, సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు బతుకమ్మ పండగ ప్రకృతికి దగర చేస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అంగన్వాడీ టీచర్స్, బుద్ధ భవన్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం అనంతరం బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నరూ. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ళ శారద, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైడ్రా ఎస్పీ అడ్మిన్, కమిషన్ సెక్రటరీ గారు పద్మజ రమణ మరియు అంగన్వాడీ టీచర్స్,వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




