– మహిళా కాంగ్రెస్ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తవమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ చౌరస్తా మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్‌లతోపాటు సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. మహిళా సంఘాలకు ఇందిరమ్మ క్యాంటీన్ల మంజూరుతోపాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం కుట్టే బాధ్యత కూడా వాటికే అప్పగించి మహిళలను సంపన్నులను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమన్నారు. మహిళా సమభావన సంఘాల బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని, మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలకు రుణాలపై బీమా కల్పించామని, ప్రమాదవశాత్తు సంఘం సభ్యురాలు మరణిస్తే భీమా ద్వారా అప్పు చెల్లింపు జరిగిపోతుందని, దురదృష్టవశాత్తు సభ్యురాలు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు చెలిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల వెసులుబాటు కోసం రూ.5 కోట్లతో ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో మహిళా సంఘాలకు ఆదరణ కొరవడిరదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలొనే మహిళలకు పెద్ద పీట వేశామని, తాము అధికారంలోకి వచ్చాకే నిరుపేదలకు చేయూత అందిస్తున్నామంటూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలొనే 40 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే అంతిమ విజయం అని చెప్పారు. కాగా, విపక్షాలను ప్రజలు విశ్వసించడం లేదంటూ సర్వేలన్నీ హస్తం వైపే చూపుతున్నాయని, ఉప ఎన్నిక విజయంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహిళా కాంగ్రెస్ సభలో పిలుపునిచ్చారు. యూసుఫ్‌గూడ చౌరస్తా నుండి ప్రచారంలో భాగంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఐసీసీి రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ నేత సునీతా రావు తదితరులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





