సచివాలయంలో మహిళా ఉద్యోగుల బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో మహిళా ఉద్యోగులు గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు హాజరు కాగా, వారితో కలిసి మంత్రులు బతుకమ్మ ఆడారు. విద్యాశాఖ సెక్రటరీ యోగిత రానా, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితారామచంద్రన్‌, సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రమాదేవి తదితరులు కూడా మంత్రులతో కలిసి బతుకమ్మ ఆడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *