– హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపపిల్లల విడుదల
– గురుకులాల మెనూలో చేపలు
-హుస్నాబాద్‌లో ఆధునిక చేపల మార్కెట్
– మంత్రులు పొన్నం ప్రభాకర్, వాటికి శ్రీహరి
హుస్నాబాద్ లో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ లు వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు లో రూ.5.17 లక్షల వ్యయంతో 3 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించి అధునాతన వెటర్నరీ హాస్పిటల్ నిర్మించాలని, అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న మోడర్న్ చేపల మార్కెట్ ను పూర్తి చేయాలని ,వెటర్నరీ డాక్టర్ పోస్టు మంజూరు చేయాలని,గోపాల మిత్ర సమస్యలు పరిష్కరించాలని మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందించి హుస్నాబాద్ పశువైద్య శాల ఆధునీకరణ , చేపల మార్కెట్ , స్టోరేజ్ సెంటర్ ,పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. గురుకులాల్లో మటన్ ,చికెన్ లాగా చేపలు కూడా మెనూ ఉండాలని ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరి లేవనెత్తిన అంశాలు గురుకులాల్లో మెనూ లో చేపలు కూడా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు లో 3 లక్షల చేప పిల్లలు వేయగా ఇంకో 60 వేల చేప పిల్లలు , రొయ్యలు వేయాలని కోరారు. హుస్నాబాద్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని ఇక్కడికి వచ్చే వారు చేపలు కొనేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మత్స్య శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.123 కోట్లు కేటాయించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ బడ్జెట్ లో 84 కోట్ల చేపపిల్లలు 10 కోట్ల రొయ్య పిల్లలు రాష్ట్రంలో ఉన్న 26వేల నీటి వనరుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. గతంలో చేపపిల్లల పంపిణీలో విషయంలో అవకతవకలు జరిగాయని ఈసారి ఏ చేప దాని సైజు ,అవి ఎన్ని చేప పిల్లలు అని తెలిపేలా పారదర్శత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు





