వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : కవిత

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2029) తాను పోటీ చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమమైన ‘ఎక్స్’ వేదికగా ఆస్క్ కవిత ప్రోగ్రాంలో భాగంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు యెస్ అని ఆమె సమాధానం ఇచ్చారు. దాంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు స్పష్టం అయింది. అలాగే మరో యూజర్ ప్రశ్నిస్తూ జాగృతి కార్యక్రమాలను కేవలం నగరానికే పరిమితం చేశారని.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. దానికి కవిత స్పందిస్తూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని, నెమ్మ దిగా.. కానీ బలంగా ముందుకొస్తామని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *