హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్ తెలిపారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు నిర్ణయమని విమర్శించారు. స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు నుంచి ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చిందని, ఆర్డర్ కాపీ కూడా అక్కడినుంచే వచ్చిందని విమర్శించారు. ట్రెజరీ బెంచ్‌కి టాయిలెట్ దగ్గరగా ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళ పక్కన కూర్చున్నామని తమ ఎమ్మెల్యేలు చెబుతున్నారని సంజయ్ అన్నారు. ‘మా వాదనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పునిచ్చారు.. స్పీకర్ తీరు రాజ్యాంగానికి విరుద్ధం.. తీర్పు కాపీని అధ్యయనం చేసి హైకోర్టుకు వెళ్తామ’ని సంజయ్ తెలిపారు. ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్న స్పీకర్ తీర్పును వ్యతిరేకిస్తున్నామని, స్పీకర్ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాలని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని, స్పీకర్ తీర్పుపై జనాలు నవ్వుకుంటున్నారని, వ్యవస్థలపై ఉన్న నమ్మకం పోయిందని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా అని సీఎం అన్నారని, తాజాగా స్పీకర్ జడ్జిమెంట్ కూడా సీఎం మాటలలాగానే ఉందని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





