గోపీనాథ్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ‌తాం

– సునీత‌మ్మ‌ను అవ‌హేళ‌న చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు
– లేడీ కావాలా లేక రౌడీ కావాలా తేల్చుకోండి
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: దురదృష్ట వ‌శాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న గోపీనాథ్ గారు అనారోగ్య కారణంగా చనిపోయారు. మగుదిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుచుంది. దివంగ‌త గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి సతీమణికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శ‌నివారం ఆయ‌న షేక్‌పేట్‌లోని అంబేద్క‌ర్ న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన కార్న‌ర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.  బాధతో, దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.  సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు మీరు బుద్ధి చెప్పాల‌న్నారు. గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఎదురీతకు మ‌హిళ‌ నిలుచుంటే అటు దిక్కు రౌడీ నిలుచున్నాడన్నారు. ఎవరు గెలవాలి? లేడీనా? రౌడీనా? అని ప్ర‌శ్నించారు. నేను మీకు మాటిస్తున్నాను. నా ఇల్లు ఇక్కడ నుంచి పది నిమిషాలు దూరం. కష్టాల్లో, మీ బస్తీ సమస్యలను పరిష్కరించేందుకు ఏ ఆపదా ఉన్న, ఏ పని పడ్డా సునీతమ్మ ఒకటే కాదు మేమందరం ఆమె కోసం అండగా ఉంటాం. మీకు సేవ చేస్తామ‌న్నారు. ముఖ్యమంత్రి రోడ్ షోలకు జూబ్లీహిల్స్ ప్రజలు రావడంలేదని కొడంగల్ నుంచి జనాలను తరలిస్తున్నా రని ఆరోపించారు. కేసీఆర్ మాట మనిషి. రూ.200 పింఛ‌నును, రూ. 2,000 చేసింది కేసీఆర్.ఆడబిడ్డ కాన్పుకైతే కేసీఆర్ కిట్టు తెచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించింది ఎవరు? బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇంటింటికి నల్ల ద్వారా తాగే నీళ్లు ఇచ్చింది కేసీఆర్. కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? హైడ్రా తేవడం తప్ప? ఈ అంబేద్కర్ నగర్లో కూడా హైడ్రా నోటీసులు ఇచ్చారన్నారు. నోటీస్ ఇచ్చాక కూడా కాంగ్రెస్ కు ఓటేస్తే రేవంత్‌రెడ్డి ఇల్లు కూలగొట్టడానికి అనుమతిచ్చారు అని అనుకుంటాడ‌న్నారు.  ఇల్లు కూలగొడతాం అన్నాక కూడా ఎవరైనా ఓటు వేస్తారా?  రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఇల్లులు కూల్చడం తప్ప ఒక్కరి అయిన ఇల్లు కట్టాడా? అని ప్ర‌శ్నించారు.  జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే మహబూబ్ న‌గ‌ర్‌లోని అవ్వ రూ.4000 పెన్షన్ వస్తుందని ఎదురుచూస్తున్నది.  నల్గొండ చెల్లి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్‌ను ఓడగొడితే రూ.2,500 వస్తాయి అని ఎదురుచూస్తున్నది.  జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్‌ను ఓడ కొడితే కరీంనగర్లో రైతన్న నాకు రూ.15వేల రైతుబంధు వస్తుందని ఎదురుచూస్తున్నాడు. ఫీజు రీయంబర్స్మెంట్ కింద చదువుకునే విద్యార్థులకు ముఖ్య‌మంత్రి స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి మాటలకు మీ చేతలతో సమాధానం చెప్పాల‌న్నారు. కారు గుర్తుకు ఓటెయ్యాలనుకునే వాళ్ళు పొద్దున్నే 6 గంటలకు లైన్లో నిల్చోని కారు గుర్తు మీద కీ అని నొక్కాల‌న్నారు.  రోడ్ రోలర్ కు చపాతీ మేకర్ కు ఓట్లు పోతాయని రేవంత్ రెడ్డికి దింపుడు కళ్ల ఆశ ఉన్న‌ద‌న్నారు.  సునీతమ్మ ఫోటోతో కారు గుర్తు కు మూడో నెంబర్ మీద ఓటు వేయండి. ఓటుకు రూ.5,000 ఇవ్వడం కాదు మహాలక్ష్మి కింద చెప్పినట్టు నెలకురూ.2,500 చొప్పున రెండు సంవత్సరాలకు రూ.60 వేల రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వాల‌న్నారు.  నేను అంబేద్కర్ బస్తీ వాసులకు మాటిస్తున్నాను.  మీరందరూ సునీతమ్మని గెలిపించండి. ఏ బుల్డోజర్ వస్తదో నేను చూస్తాన‌న్నారు.  ఒక సీటి కొడితే పావుగంటలో వచ్చి బుల్డోజర్ కి అడ్డంగా నేను నిల్చుంటాన‌న్నారు.మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటదన్నారు.  కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అని అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.కాంగ్రెస్ కంటే ముందు ముస్లింలు ఉన్నారు. కాంగ్రెస్ ఖతమైన తర్వాత కూడా ముస్లింలు ఉంటారు. రేవంత్ రెడ్డికి ముస్లిం సోదరులు ఓటుతో సమాధానం చెప్పాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *