ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఎందుకీ వివ‌క్ష‌?

ఉన్న‌త‌స్థాయి పోస్టుల భ‌ర్తీలో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం
– ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ

ఎస్సీఎస్టీఇతర వెనుకబడిన వర్గాల వారి పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాహుల్‌ ‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీఎస్టీఓబిసి తరగతుల చెందిన వారి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను వ్యవస్థీకృత‌ వివక్షగా రాహుల్‌ అభివర్ణించారు. ఈ తరగతులకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులను ఎన్‌ఎఫ్‌ఎస్‌ (‌నాట్‌ ‌ఫౌండ్‌ ‌సూటబుల్‌) అని తిరస్కరిస్తున్నారు. ఇది మనువాదం యొక్క కొత్త రూపం అని రాహుల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ ‌పోస్టులో పేర్కొన్నారు. అర్హత కలిగిన ఎస్సీఎస్టీఓబిసి తరగతులకు చెందిన అభ్యర్థులను నాయకత్వ పాత్రల నుండి మినహాయించడానికి కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వారిని అనర్హులుగా మార్చేస్తున్న‌ద‌ని ఆరోపించారు.

దిల్లీ విశ్వవిద్యాలయంలో 60 శాతం రిజర్వ్‌డు ప్రొఫెసర్‌ ‌పోస్టులు, 30 శాతం అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ‌పదవులు ఖాళీగా ఉన్నాయి. సమానత్వానికి విద్య ఒక సాధనం అనే బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌దృక్పథాన్ని మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది. కేంద్రం ఈవిధమైన చర్యలతో రాజ్యాంగంపై దాడి చేస్తోంది. సామాజిక న్యాయ ద్రోహానికి పాల్పడుతోంది. ఐఐటిలుకేంద్ర విశ్వవిద్యాలయాలు ఇలా అన్నిచోట్ల వీరిపై కుట్ర జరుగుతోంది. వీరు చేసే పోరాటం విద్య కోసమోఉపాధి కోసమో చేసే పోరాటం కాదు. ఇది హక్కులుగౌరవంభాగస్వామ్యం కోసం చేసే పోరాటమని’ అని ఎక్స్ ‌పోస్టులో పేర్కొన్నారు. తాను దిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్‌ ‌యూనియన్‌ (‌డియుఎస్‌యు) విద్యార్థులతో మాట్లాడానని.. బిజెపిఆర్‌ఎస్‌ఎస్‌లు అమలు చేస్తున్న రిజర్వేషన్ల వ్యతిరేక చర్యపై పోరాటం కొన‌సాగిస్తామ‌ని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *