వంటింటి సామాన్లతో సిద్దంగా ఉండండి

– మహిళలకు బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ పిలుపు

కోల్‌కతా, ప్ర‌జ‌తంత్ర‌, డిసెంబర్‌11: ‌పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకురాలు మమతా బెనర్జీ  మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆమె ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈసీ ‘బీజేపీ కమిషన్‌’‌గా మారిందని, దిల్లీ నుంచి వొచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటోందని ఆరోపిస్తున్నారు. వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా గురువారం మహిళలను ఉసిగొల్పారు. ఆ సవరణ తర్వాత వోటరు జాబితాలో పేర్లు తొలగింపునకు గురైతే కిచెన్‌ ‌టూల్స్‌తో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ ‌పేరుతో తల్లులు, సోదరీమణుల వోట్లను లాక్కుంటారా? ఎన్నికల సమయంలో దిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు.. జాబితాలో పేరు లేకపోతే వంట గదిలో వాడే పరికరాలు ఉన్నాయి కదా.. అవే బలం.. మహిళలు ముందుండి పోరాడుతారు.. మగవారు వారి వెనక ఉంటారు. మహిళలా లేక బీజేపీనా? ఎవరు బలవంతులో చూడాలని అనుకుంటున్నాను. నేను లౌకికవాదాన్నే నమ్ముతాను. ఇక్కడి ప్రజలను విభజించేందుకు ఎన్నికల సమయంలో బీజేపీ డబ్బు వాడి వేరే రాష్ట్రాల  నుంచి మనుషుల్ని దింపుతుంటుంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌, ‌నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌వంటివారు ఏనాడూ ప్రజలను విభజించేలా వ్యవహరించలేదు. మరి వీరంతా ఎవరు? భారత స్వాతంత్య్రం కోసం బెంగాల్‌ ‌ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలంటూకృష్ణానగర్‌ ‌ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలకు ఇటీవల ప్రధాని మోదీ  దిశానిర్దేశర చేశారు. ఆ పక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న వోటర్లను చేర్చడం, అర్హత లేని వారిని తొలగించడమే దాని ఉద్దేశమని, ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *