– ఓట్ చోరీపై రాష్ట్రంలో సంతకాల సేకరణ
-మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే , రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన దిల్లీ వెళ్లారు. ప్రయాణానికి ముందు ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ను తమ తాబేదారిగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఓటు చోరికి పాల్పడుతున్నదని రాహుల్ గాంధీ చెబుతున్నారన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ప్రజాస్వామిక వాదులంతా ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు ఖండించాలని కోరుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నుండి ఓటు చోరీ పై లక్షలాది సంతకాల సేకరణ చేసి ఢిల్లీలోని ఏఐసీసీ ద్వారా రాష్ట్రపతి గారికి అందిస్తామన్నారు. రాజ్యాంగాన్ని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా కంకణం కట్టుకొని వుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





