-మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికల్లో కులం కా గుణం చూసి ఓటేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటు వేయాలని కోరారు. తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. జాగృతి కార్యాలయంలో సోమవారం మీడియాతో కవిత మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎవరు నిలబడ్డా కారు గుర్తుపై వోటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించారు. చెడ్డ వాళ్లకి వోటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. రేవంత్‌రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కు అయి నాటకాలాడుతున్నారని కవిత విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫెయిర్‌గా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్‌ని సిట్ విచారణకు పిలిచిందని ప్రస్తావించారు. ఈ కేసులో సిట్ విచారణకు పిలిస్తే ఎవరైనా పోక తప్పదని కవిత స్పష్టం చేశారు. కేంద ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్జడెట్‌లో తెలంగాణకు మోదీ సర్కార్ అన్యాయం చేసిందని కవిత విమర్శించారు. హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతున్నా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ ఫీజు సొంతంగా కట్టుకున్నారా? ప్రభుత్వ సొమ్ముతో కట్టారా అని ప్రశ్నించారు.రేవంత్‌రెడ్డి ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి ఎన్ని ఏంఓయూలు చేసుకున్నారని నిలదీశారు. ఫేక్ కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూలపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. ఫేక్ ఏంఓయూలపై జాగృతి పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





