17న బీజేపీ కార్యాలయాల్లో విశ్వకర్మ య‌జ్ఞం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జాతీయ పండుగగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ బీజేపీ ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ఈనెల 17న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరపడంపై విధివిధానాలు చర్చించేందుకు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ విశ్వకర్మ సెల్‌ ఆధ్వర్యంలో 2003 నుండి చేతివృత్తుల కుటుంబాలైన విశ్వకర్మలకు సన్మాన కార్యక్రమాలు చేయడం, విశ్వశాంతి కోసం యాగాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జాతీయ పండుగగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా దేశవ్యాప్తంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్‌ యోజన అనే పేరుతో ఒక పథకాన్ని ఏర్పాటు చేసి చేతివృత్తుల కుటుంబాలకు చేయుటనందించడానికి బృహత్తర కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కావున సమస్త విశ్వకర్మలు, చేతివృత్తుల కుటుంబాలకు చెందిన వారు ఈ కార్యక్రమానికి హాజరై విశ్వకర్మ భగవానుని కృపకు పాత్రులు కావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామచందర్‌రావుతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర నాయకులు, విశ్వకర్మ పెద్దలు, ఇతర వృత్తి కళాకారులు హాజరవుతారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *