– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– గవర్నర్‌తో కలిసి అమర జవాన్లకు నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ఆనాటి భారత సైనికులు ధైర్య సాహసాలతో పాకిస్థాన్‌పైఊ యుద్ధం చేసి దానినుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిన రోజు విజయ్ దివస్ అని, ఈరోజు చరిత్రలో గర్వించదగిన, గుర్తుంచుకోదగిన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లోని అమర జవాన్ల స్తూపం వద్ద ఆయన మంగళవారం పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. విజయ్ దివస్ సందర్భంగా ఆనాటి అమర జవాన్లను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. యుద్ధ సమయంలో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ, సైనిక నాయకులు, అమర జవాన్లు అందరికీ వందనాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





