– విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విక్టోరియా పార్లమెంట్‌ను శుక్రవారం సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్‌ను వారికి వివరించారు. ట్రాన్స్‌పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ-విక్టోరియా’ మధ్య ఇన్‌స్టిట్యూషనల్ కొలాబరేషన్‌ను పెంపొందించేందుకు చొరవ చూపాలని కోరారు. ప్రగతిశీల విధానాలను అనుసరిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని లీ తార్లామిస్, షీనా వాట్‌లు తెలిపారు. ‘తెలంగాణ- విక్టోరియా’ మధ్య ద్వైపాక్షిక సహాకారాన్ని పెంపొందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




