- వార్డు సభ్యుడిగా ఎన్నికైన ఆమె భర్త రమేష్
- 8 వార్డులలో కాంగ్రెస్ గెలుపు
భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం వంగర (Vangara) గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2024) లో కాంగ్రెస్ హవా కొనసాగింది. సర్పంచ్‌తో సహా 8 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 150 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సీ మహిళా రిజర్వేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గజ్జల సృజన 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఆమె భర్త గజ్జల రమేష్ 12వ వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. ఈ సందర్భంగా సృజన- రమేష్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా గత ఎన్నికల్లో సర్పంచ్‌తో సహా వార్డు మెంబర్ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి కాంగ్రెస్ 8 వార్డులు, సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మూడు వార్డులలో బిఆర్‌ఎస్, 1 వార్డులో ఇండిపెండెంట్ విజయం సాధించినట్లు సమాచారం.





