వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ

– నలుగురు యువకుల మృతి

పాట్నా, అక్టోబర్‌ 3: పట్టాలు దాటుతున్న సమయంలో వందేభారత్‌ హైస్పీడు రైలు ఢీకొనడంతో నలుగురు యువకులు మృతిచెందారు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జోగ్బాని నుంచి పాటలీపుత్రకు రైలు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను జీఎంసీకి తరలించగా మృతదేహాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. దుర్గా మేళాలో సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వెళ్లిన యువకులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మృతులంతా 18 నుంచి 24 ఏళ్ల వయస్సు వారేనని చెబుతున్నారు. నార్తర్న్‌ ఫ్రాంటియర్‌ రైల్వేస్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ నలుగురి మరణాలను ధ్రువీకరించారు. ఉదయం 4.54 గంటలకు పూర్ణియా- కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బానీ-దానపూర్‌-26301 (వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌) రన్‌ఓవర్‌ గురించి తమకు సమాచారం అందింది. ఘటన జరిగినప్పుడు వారు ట్రాక్‌పై సోషల్‌ మీడియా రీల్స్‌ చేస్తున్నారని అనుమానిస్తున్నారు అని తెలిపారు. మృతులు ఎవరనేది గుర్తించే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *