ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.

– మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, క్రీడలు, యువజన సేవలు, మత్స్య శాఖల మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలోని ఉట్కూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆహార భద్రత రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడిరగ్స్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల గ్రామీణ పేద ప్రజలకు ఆశావహమైన భవిష్యత్తు నెలకొంటోందన్నారు. ముఖ్యంగా గృహ భద్రత, ఆహార భద్రత, వివాహ సహాయం వంటి పథకాల ద్వారా సామాజిక న్యాయం అమలవుతోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడిరగ్స్‌ ద్వారా నిరాశ్రయ కుటుంబాలకు గృహ కల్పన, రేషన్‌ కార్డుల ద్వారా ఆహార భద్రత, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు మద్దతు అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులకు చెక్కులు, ప్రొసీడిరగ్స్‌, రేషన్‌ కార్డులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీను, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *