– డిమాండ్‌కనుగుణంగా జిల్లాలకు పంపిణీ
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ వారం రోజులలో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా విడుదలైందని వ్యవసాయ, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండుకనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపికి ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం అసమర్థతతో ఇతర దేశాల నుండి యూరియాను తెప్పించి రాష్ట్రాలకు సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమైందంటూ కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరాలో ఆలస్యానికి చింతిస్తున్నామన్నారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంత వరకైనా పోరాడతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్(ఆర్‌ఎఫ్‌సీఎల్) నుండి రావాల్సిన యూరియాను తెప్పించడానికి ఇప్పటికే ఆ సంస్థ ఎండీతో మాట్లాడామని తెలిపారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకుని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామని మంత్రి తుమ్మల వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.


