Take a fresh look at your lifestyle.

లక్ష్యాలు ఉన్నతమే – ఆచరణే అయోమయం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో బోధనాభ్యసన సామర్థ్యాల పెంపుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేబూనటం ఆహ్వానించతగినదే!కానీ వాటి అమలుకోసం రూపొందించిన కార్యాచరణ లలో లోపాలను సవరించుకోవల్సివుంది. విద్యార్థుల విద్యా సంక్షేమం కోసం రూపొందించి , అమలు చేసే కార్యక్రమాల లక్ష్యాలు ఉన్నతమైనవే కానీ అవి బడులను క్యాలెండర్‌ ‌సమయాన్ని గందరగోళ పరిచేది కాకూడదు.లిఎల్‌.ఐ.‌పిలి కార్యాచరణ ప్రణాళిక క్షేత్ర స్థాయి ఆచరణలో ప్రయివేట్‌ ‌శక్తుల భాగస్వామ్యం , ప్రభుత్వ ఉపాధ్యాయులను అనుమానించేదిగా, అవమానించేదిగా వుండటం  పై ఉపాధ్యాయుల, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. మూడేసి , నాలుగేసి కార్యక్రమాలు ఒకేసారి విద్యా సంవత్సరం ఆరంభంలోనే హడావుడి గా అమలు చేయటం మూలానా ఆ కార్యక్రమాలు  మొక్కుబడి వ్యవహారంగా మారి అభాసు పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవల్సివుంది.

ప్రభుత్వం ఆగస్ట్ ‌లో ఉన్నత పాఠశాలల్లో నిర్వహించబోయే లిలెర్నింగ్‌ ఇం‌ప్రూవ్‌మెంట్‌ ‌ప్రోగ్రాం’లి (ఎల్‌ఐపీ) ఉపాధ్యాయుల బోధనానుభవాన్ని, విషయపరిజ్ఞానాన్ని, పని సంస్కృతిని అనుమానించేలా ఉంది. అవసరమైన విద్యార్హతలతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి, వృత్తి లో రెండు,మూడు దశాబ్దాలుగా విద్యార్థులతో క్షేత్ర స్థాయి సంబంధం కలిగిన ఉపాధ్యాయులు సిద్దంచేసిన పాఠ్యప్రణాళికలలో నాణ్యత లేదని ప్రభుత్వం భావించటం ఉపాధ్యాయులను తెలంగాణ సమాజం ముందు అవమానించటంగానే భావించక తప్పదు. గత రెండు దశాబ్దాలుగా ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి.వేర్వేరు పేర్లతో ఇచ్చిన శిక్షణలు తెలంగాణ ఉపాధ్యాయులతో నాణ్యత గల పాఠ్యప్రణాళికలు రాయించలేకపోయాయని ప్రభుత్వం విశ్వసిస్తుందా!?అదే నిజమైతే ఆ శిక్షణల పరంపరలన్నీ వైఫల్యం చెందినట్టు భావించాలా!?ఒక వేళ శిక్షణలు బాగుండి ఉపాధ్యాయుల వైఫల్యం వున్నట్లైతే లిఅపెప్‌లి నుండి ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. ‌వరకు జరిగిన ఇన్ని శిక్షణలలో ఏ ఒక్క శిక్షణ పై గానీ శిక్షణానంతరం గానీ  క్షేత్రస్థాయిలో సమీక్ష చేశారా!?సాఫల్య,వైఫల్యాలను చర్చించి శిక్షణల లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశారా!?ఈ వరుస శిక్షణలన్నింటి తరువాత కూడా ఉపాధ్యాయులు వరుసగా వైఫల్యం చెందుతున్నారనే అనుకుంటే నిజానికి ఆ శిక్షణల్లో సారం లేనట్టు భావించాలి కదా!ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల తరగతి బోధనాభ్యసనలను పర్యవేక్షిందుకు కొందరు విషయనిపుణులతో బృందాలు సిద్దం చేస్తుంది.యేళ్ళ తరబడి విద్యార్థితో క్షేత్రస్థాయిలో బోధనాభ్యసనసంబంధాలు సన్నగిల్లిన ఉపాధ్యాయులు ఇప్పుడు పర్యవేక్షక బృంద సభ్యులవుతారు. పాఠ్యప్రణాళికలు కూడా సిద్దం చేస్తారు.

వీటి ఆధారంగానే తరగతి బోధనాభ్యసనలను ఉపాధ్యాయులందరూ చేపట్టాలనే ఆ శిక్షణ ఉద్దేశాలు ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నాయో ఆమలు క్రమంలో అవగతం అవుతాయి.

లెర్నింగ్‌ ఇం‌ప్రూవ్‌మెంట్‌ ‌ప్రోగ్రాం
6 నుంచి 9 తరగతుల విద్యార్థులలో కనీస సామర్థ్యాల సాధనకు బోధనలో ప్రమాణాల పెంపు లక్ష్యంగా ‘లెర్నింగ్‌ ఇం‌ప్రూవ్‌మెంట్‌ ‌ప్రోగ్రాం’ (ఎల్‌ఐపీ)ను ఆగస్టులో ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.ఇందు కోసం జూలైలో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది.తరగతి గది బోధనను మెరుగుపర్చడం, విద్యార్థులు నిర్ధేశించిన వారి భాషల్లో చదవడం,రాయడంతో పాటు టీచర్లలో.బోధనా. సామర్థ్యాలను పెంచడం (టీచర్స్ ‌కెపాసిటీ బిల్డింగ్‌) ‌వంటి అంశాలపై దృష్టిసారించారు.ఏం చదివారో,ఏం నేర్చుకున్నారో చెప్పలేని పరిస్థితుల నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు ఈ కార్యక్రమం ద్వారా విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఆస్కీ, సేవ్‌ ‌ది చిల్డ్రన్స్ ‌సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు.కార్యక్రమ నిర్వహణ అమలు ఇలా..
తొలుత విద్యార్థులకు బేస్‌లైన్‌ ‌టెస్ట్ ‌నిర్వహిస్తారు. దీని ఆధారంగా విద్యార్థుల ప్రగతి అంచనా వేస్తారు.టీచర్లుపాఠాలు ఎలా చెబుతున్నారో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి పర్యవేక్షణ చేస్తారు.టీచర్ల బోధనాభ్యసనలలో లోపాలను ఎత్తిచూపకుండా నిర్మాణాత్మక సూచనలు,ఆయా లోపాలు అధిగమించేందుకు కావాల్సిన మద్దతును అందజేస్తారు.ముద్రించిన పాఠ్యప్రణాళికలను టీచర్లందరికీ అందజేయాలని, ఆ ప్రణాళికల ప్రకారమే పాఠాలు టీచర్లు బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు టీచర్లు సొంతంగా తయారుచేసిన పాఠ్యప్రణాళికలు నాణ్యంగా ఉండటం లేదని ప్రభుత్వం అభిప్రాయ పడుతుంది.ఈ నేపథ్యంలోనే అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తూ.ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి ఈ పాఠ్యప్రణాళికలను రూపొందించినట్టు తెలిపింది.

అమలు లోపాల సంగతేమిటి ?
ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి.ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ ‌సిద్దం చేసేప్పుడు తరగతి బోధనాభ్యసనలు,పాఠ్యాంశ ,సహ పాఠ్యాంశ,మూల్యాంకనాలకు తగు సమయాలను,తేదీలను కేటాయిస్తుంది. వివిధ కార్యక్రమాల నిర్వహణ, వివిధ శిక్షణల కోసం సమయాన్ని కేటాయించదు. జూన్‌ ‌లో విద్యా దినోత్సవం, జులైలో పఠనోత్సవం,ఆగస్ట్ ‌లో లిలిప్‌లి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఎంపిక చేసిన మూడు జిల్లాలు వరంగల్‌,‌ఖమ్మం ,ఆదిలాబాద్‌ ‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎస్సి,ఎస్టి ,విద్యార్థుల కోసం లిఎకడమిక్‌ ఎ‌న్రీచ్‌ ‌మెంట్‌ ‌డ్రైవ్‌లి కార్యక్రమం అమలు చేయబోతున్నది.ఈ కార్యక్రమాలపై సి.ఆర్‌.‌పి. కాంప్లెక్స్ ‌ప్రధానోపాధ్యాయులు క్లస్టర్‌ ‌పరిధిలోని పాఠశాలల సందర్శన , మండల విద్యాధికారి, జిల్లా పరిశీలన బృందాలు వీరి సందర్శన సందర్భాల్లో తరగతి బోధనా భ్యసనలు క్యాలెండర్‌ ‌షెడ్యూల్‌ ‌బదులు అన్‌ ‌షెడ్యూల్‌ ‌వైపు మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 20 వేలకు ఫై చిలుకు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ వున్నాయి. పర్యవేక్షకాధికారులు,మండల విద్యాధికారులు, గెజిటెడ్‌ ‌ప్రధానోపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి.ఉపాధ్యాయులు కొరతతో నడుస్తున్న పాఠశాలల్లో ఈ శిక్షణల కోసం విషయ నిపుణులుగా వెళ్ళటం తిరిగి మండల స్థాయి శిక్షణలు,ఇవ్వటం వీటన్నింటికి హాజరయ్యే ఉపాధ్యాయుల కు పని వత్తిళ్ళు పెరగటం ,తరగతుల నిర్వహణ నష్టాలు లెక్కలోకి రావటం లేదు. పైగాఈ సమస్త కార్య నిర్వహణ నివేదికల సిద్దంచేయటం,ఎం.ఆర్‌.‌సి.లలో అందచేయటం,ఆన్‌ ‌లైన్‌ ‌చేయటం ఇవన్నీ రెగ్యులర్‌ ‌బోధనాభ్య సనలకు ఉపాధ్యాయులను దూరం చేసేడివే అనేది వాస్తవమని అంగీకరించాలి. ప్రయివేట్‌ ‌సంస్థల జోక్యం అవసరమా! ?  ఈ కార్యక్రమం అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ,లిఆస్కీలి,  లిసేవ్‌ ‌ది చిల్డ్రన్స్‌లి  సంస్థల భాగస్వామ్యం తీసుకుం టున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే కార్యక్రమం లో లిఆస్కీలి, లిసేవ్‌ ‌ది చిల్డ్రన్స్‌లి వంటి ప్రయివేట్‌ ఎన్‌.‌జి.ఓ. ల భాగస్వామ్యం యొక్క అవసరం ఏందుకోసమనేది తెలుపలేదు. సుదీర్ఘ విద్యారంగానుభవం గల ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి. అధ్యాపకులు, ఆచార్యులు, రాష్ట్ర పాఠశాలల లోని సీనియర్‌ ‌విషయనిపుణులకు ప్రయివేట్‌ ఎన్‌ ‌జి.ఓ.ల నుండి విద్వత్తు సహకారం ఏర్పాటు చేయటం సరైనదేనా అనేది పునరాలోచించాలి.లేదంటే వారి నుండి  కార్యక్రమ డిజైనర్లు మరేదైనా ఆశీస్సులు ఆశించి వుండాలి. ఈ ప్రయివేట్‌ ‌శక్తుల ప్రవేశం కోసం ప్రభుత్వం లోని కొందరు వ్యక్తుల ఆసక్తి ప్రశ్నార్ధకంగా మారింది.ఈ అంశంపై ఉపాధ్యాయులు కన్నెర్ర చేయక ముందే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నుండి ఈ ఎన్‌.‌జి.ఓల జోక్యంపై ప్రకటన వెలువడింది. ప్రభుత్వ పాఠశాలల్లో  కార్యకలాపాలు చేపట్టేందుకు ‘‘సేవ్‌ ‌ది చిల్డ్రన్‌’’‌తదితర ఎన్‌.‌జీ.ఓ.లను అనుమతించరాదని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. స్థానికత ప్రాధాన్యత విస్మరణ   భాష పరంగానో,సంస్కృతి పరంగానో ఒకే చోట కలిసి జీవించే ప్రజలలో కూడా కొంత విభిన్నత చోటు చేసుకుంటుంది. తెలంగాణ జిల్లాల మధ్య సంస్కృతి, తినుబండారాలు , ఆహారపుటలవాట్లు, వ్యవహార భాషా పదజాలంలో కొంత  అంతరం వుంటుంది. పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాల ఎంపిక ఈ అంతరాల అంశాన్ని విస్మరిస్తుందనే విమర్శ వుంది.కార్యక్రమం ఏదైనా అమలులో వందశాతం ఫలితాలు సాధించాలనుకున్నప్పుడు ఈ స్థానికత తో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అమలు చేసే కార్యక్రమం యొక్క ఫలితాల పై స్థానిక భౌతిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు,విద్యార్థుల మధ్య వైయుక్తిక, నాగరికత, ప్రసారమాధ్యమాల ప్రభావం, పట్టణ, గ్రామీణ జీవన నేపధ్యాల అంతరాలు ఇవన్నీ ప్రభావం చూపుతాయి. కాబట్టి కార్యక్రమ లక్ష్యాల మూలం,సారం ఒక్కటే అయినా స్థానిక సమాజానికి అనుగుణంగా మార్పులు చేర్పులు అవసరమవుతాయి. ఇందుకుగాను ఆయాప్రాంతాలలో స్థానిక సామాజిక వాతావరణంతో సుదీర్ఘ అనుభవం గల,క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేసుకునే స్వేచ్ఛాయుత భాగస్వామ్యం వుండాలి.ఈ ప్రధాన సూత్రీకరణ విస్మరించటం మూలంగానే అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఆమలులో వైఫల్యం చెందుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారి సుదీర్ఘానుభవంతో రూపొందించిన పాఠ్యప్రణాళికలల్లో నాణ్యత లేదని భావిస్తున్న ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి. తన అభిప్రాయం పై పునరాలోచించాలి.స్థానిక  ఉపాధ్యాయులతో పాఠశాల లేదా కాంప్లెక్స్ ‌స్థాయిలో పాఠ్యప్రణా ళికలు రూపొందింపచేసి ఉపయోగించాలి.
– అజయ్‌
ఉపాధ్యక్షుడు.టి.పి.టి.ఎఫ్‌.‌వరంగల్‌., ‌సంపాదకులు,
ఉపాధ్యాయదర్శిని, టి.పి.టి.ఎఫ్‌.అధికార.మాసపత్రిక

Leave a Reply