ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
న్యూదిల్లీ,జూన్ 26: రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా రaుళిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే పక్రియను ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వద్ద సుమారు 2800కి పైగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6శాతం వోట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలి. మిగిలిన పార్టీలను నమోదిత గుర్తింపులేని పార్టీలుగానే పరిగణిస్తారు.





