బీసీ బంద్‌కు మద్దతుగా సంఘాల ర్యాలీ

– పాల్గొన్న బీసీ ఐకాస చైర్మన్‌ కృష్ణయ్య, టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష, బీసీ సంఘాలు హైదరాబాద్‌లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్‌ ‌కూడలి నుంచి ట్యాంక్‌ ‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ ‌విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. బీసీ ఐకాస చైర్మన్‌ ఆర్‌.‌కృష్ణయ్య, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, ‌బీసీ ఐకాస వర్కింగ్‌ ‌చైర్మన్‌ ‌జాజుల శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్‌ ‌చేశారు. జనాభాలో సగభాగానికి పైన ఉన్న బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. శనివారం జరిగే  తెలంగాణ బంద్‌లో పార్టీలు, సంఘాలకు అతీతంగా శ్రేణులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *