– నిలిచిన విద్యుత్ సరఫరాల
– ఆక్సిజన్ అందకనే మృతి
– తల్లిదండ్రుల ఆరోపణ
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కెన ఎంజీఎం హాస్పిటల్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న పిల్లల విభాగంలో రెండు నెలల పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన రెండు నెలల బాబు మూడు రోజుల క్రితం సబ్బు నీళ్ళు నోటిలోకి వెళ్లడంతో ఎంజీఎం హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్నారికి ఆక్సిజన్ అందక మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో పసికందు మృతి





