ఇద్ద‌రు మావోయిస్టుల లొంగుబాటు

ఏటూరునాగారం, ప్రజాతంత్ర, జనవరి 16:‌ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు స్థానిక ఏఎస్పి మనన్ బట్ ముందు శుక్రవారం లొంగిపోయారు. ఏఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్‌ అధికారులు, ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన “పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి” అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి తెలుసుకొని, మావోయిజాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో నిషేధిత‌ (మావోయిస్టు) పార్టీకి చెందిన కుడియం పాండు అలియాస్ కార్తీక్ తో పాటు మ‌రో స‌భ్యుడు లొంగిపోయార‌న్నారు. వీరికి సరెండర్ పాలసీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 25000 రూపాయల పునరావాస చెక్ లను ఏఎస్పీ వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రశస్త్, వెంకటాపురం సిఐ రమేష్, వాజేడు, వెంకటాపూర్ ఎస్సైలు సతీష్, తిరుపతి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *