ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

– తన పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై సమీక్ష
– ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటల లోపే రిపోర్టు చేయాలి
– ఆ ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని తుమ్మల ఆదేశం
– రేపటి నుండి ఆలస్యంగా వస్తే శాఖఆాపరమైన చర్యలు తప్పవు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: తన మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై మంత్రి తుమ్మల సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉదయం 10.40 గంటల వరకు కూడా విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరుకావాలని, అలా రాని ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులంతా రైతులకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని, రైతులకు కావాల్సిన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, పంటలు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. యూరియా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మంత్రి రాష్ట్రానికి వస్తున్న యూరియాను డిమాండ్‌ ఎక్కువగా ఉన్న జిల్లాల వారీగా కేటాయించాలని, అలాగే జిల్లాలల్లో భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలు త్వరగా సేకరించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపిని ఆదేశించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *