– మోదీ నాకు హావిూ కూడా ఇచ్చారు
– మరోమారు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్, అక్టోబర్ 16: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని, ఈమేరకు ప్రధాని మోదీ తనకు హావిూ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ఓ డిన్నర్ ఈవెంట్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి రష్యాను ఒంటరిని చేయడంలో ఇదొక కీలక అడుగని అభివర్ణించారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై ప్రధాని మోదీ వద్ద తాను ఆందోళన వ్యక్తం చేశానని, మాస్కో నుంచి భారత్ చమురు కొనడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు పుతిన్ ఆ నిధులు ఉపయోగిస్తున్నారని అమెరికా భావిస్తున్నట్లు తెలిపానన్నారు. ఈ కొనుగోళ్లపై తాను సంతోషంగా లేనని చెప్పానన్నారు. ఈ సందర్భంగా ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రధాని మోదీ ఈరోజు తనకు హావిూ ఇచ్చారని. ఇదొక కీలక ముందడుగు అని చెప్పారు. చైనా కూడా రష్యా ఆయిల్‌ను కొనకుండా చేస్తానని, ఇక అదే మిగిలి ఉందని తెలిపారు. భారత్, చైనా అమెరికాతో కలిసి వస్తే పుతిన్ చేస్తున్న యుద్దానికి చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధన విధానంపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యూఎస్‌కు భారత్ సన్నిహిత భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తనకు స్నేహితుడని, తమ మధ్య గొప్ప అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో ప్రతి ఏడాది కొత్త నాయకుడు వచ్చేవారు. కొందరు కొన్ని నెలలకే మారిపోయేవారన్నారు. కానీ ఇప్పుడు తన మిత్రుడు చాలాకాలంగా అక్కడ అధికారంలో కొనసాగుతున్నారని వెల్లడిరచారు. మోదీ నాయకత్వంలో రాజకీయంగా స్థిరత్వం సాధించిందని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా భారత్`పాకిస్థాన్ కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. యుద్ధం ఆపకపోతే 200శాతం టారిఫ్‌లు విధిస్తానని ఈ దేశాలను తాను హెచ్చరించానన్నారు. వాణిజ్యంతోనే తాను భారత్`పాక్ ఉద్రిక్తతలను తగ్గించానని తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌కు కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ గురించి ఆయన ప్రస్తావించారు. ‘గోర్ గొప్పగా పనిచేస్తున్నారు. ఆయన భారత్‌లో అమెరికాకు మంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





