పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

– ఏడుగురి దుర్మరణం

రాజ్‌కోట్, ఏప్రిల్ 13: ఓ ట్రక్కు అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా మరో వ్యక్తి రోడ్డు పక్కన తన వాహనం టైరు మారుస్తున్న డంపర్ డ్రైవర్. యాత్రికులు రాజస్థాన్ రాజ్‌కోట్‌లోని గద్కా గ్రామం నుంచి దేకావాలాలోని మహదేవ్ ఆలయానికి సోమవారం తెల్లవారు జామున వెళ్తుండగా లఖ్తర్-విరామ్‌గామ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. భాస్కర్‌పారా సమీపంలో ఓ వ్యక్తి రోడ్డుపై ఆగిపోయిన డంపర్‌కు టైరు మారుస్తున్నాడు. యాత్రికులు ఆ డంపర్‌ను దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు దుర్మరణం చెందగా వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డంపర్ టైరు మారుస్తున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా అతడిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *