– బీఏఎస్ నిధులు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి
– సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరికి ధన్యవాదాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్(టీఆర్‌ఎస్‌ఎం) అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నదని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి వెల్లడిరచారు. టీఆర్‌ఎస్‌ఎం అసోసియేషన్ పక్షాన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను బుధవారం సచివాలయంలో కలిసి తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో 237 బెస్ట్ అవైలబుల్ స్కీం పాఠశాలలు ఉండగా 20వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని వెల్లడిరచారు. బెస్ట్ అవైలబుల్ స్కీం స్కూల్స్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు బకాయిల్లో 25% వెంటనే విడుదల చేసిన భట్టి విక్రమార్క మల్లు, మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌లకు సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిన 75 శాతం నిధులను దశలవారీగా విడుదల చేసేందుకు డిప్యూటీ సీఎం అంగీకరించారన్నారు. కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలలకు మిన్నగా బెస్ట్ అవైలబుల్ స్కీం పాఠశాలల్లో ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. మొదటి తరం పేద విద్యార్థులు ఈ స్కీం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తమ యాజమాన్యాలు, సిబ్బంది ప్రభుత్వం వెన్నంటి ఉంటామని, ప్రభుత్వానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో ఆయనతోపాటు సంఘం గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





