అబ్దుల్‌ కలాంకు సీఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్‌ కలాంకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధ‌వారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శాస్త్ర‌వేత్త‌గా, రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీలు రఘువీర్‌ రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎంఎల్‌ఏ రాందాస్‌ నాయక్‌లు పాల్గొని అబ్దుల్‌ కలాంకు నివాళులర్పించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *