జైపాల్‌రెడ్డికి ఘన నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని ఆయన సమాధి స్ఫూర్తి స్థల్‌ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం పుష్ప గుచ్ఛాలుంచి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, పలువురు పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జైపాల్‌ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *