– ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పుర్‌లో ఘటన
రాయపూర్, నవంబర్ 4: ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. మంగళవారం బిలాస్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లాల్‌ఖదాన్ ప్రాంతంలో మెము ప్యాసింజర్-గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో బిలాస్‌పుర్-హావ్‌డా లైన్ మార్గంలో రైళ్లరాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. దాంతో పలు సర్వీసులను రద్దు చేశారు. మరికొన్నింటిని దారిమళ్లించారు. ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ఎలక్ట్రి వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. వైద్య సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు. దెబ్బతిన్న కోచ్‌లను పట్టాల నుంచి తొలగిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





