– హైదరాబాద్‌లో బిర్యాని తిని ఒకరి మృతి
– 15 మందికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
గచ్చిబౌలిలో యువకుడి అనుమానాస్పద మృతి
గచ్చిబౌలిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం రాత్రి కొండాపూర్ శ్రీరాం నగర్ కాలనీ నుంచి బోటానికల్ గార్డెన్ వైపు.. పాలపిట్ట పార్క్ సపంలోని రహదారిపై శంకర్ (19) అనే యువకుడు నిర్జీవంగా పడి ఉన్నాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. అతడి జేబులోని సెల్ ఫోన్ ద్వారా అతని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. స్నేహితులు వెంటనే పాలపిట్ట పార్క్ వద్దకు చేరుకుని శంకర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. శంకర్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాలపిట్ట పార్క్ సపంలో సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడి మృతి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. మృతుడు శంకర్.. నగరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





