ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గడ్డు కాలం

డా. ముచ్చుకోట . సురేష్ బాబు, విద్య పరిరక్షణ కమిటీ. 9989988912

దశాబ్దం కిందటదేశంలోనే అగ్రగామిగా ఉన్నఆంధ్రప్రదేశ్ నేడు పూర్తిగాప్రమాదపు అంచునఉన్నట్లు కనిపిస్తుంది.గత దశాబ్ద కాలంగా   ఇంతటి అధోగతికి కారకులెవరు?రాష్ట్రం విడిపోయిన తరువాతరెండు రాష్ట్రాల్లోవిద్య ప్రమాణాలునీచ స్థితి చేరుకున్నాయి.  గతపదిహేను  సంవత్సరాలుగా అధ్యాపకనియామకాలు చేపట్టకపోవడం,రీసెర్చు గ్రాంటులు పూర్తిగానిలిపివేయడం, పరిశోధనలు పక్కదారి పట్టిచివరికి అధఃపాతాళానికిచేరింది. వంద  సంవత్సరాల ఘనకీర్తి గడించిన ఆంధ్ర  విశ్వవిద్యాలయంలో , డెబ్భై సంవత్సరాలు కిందట నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, నలభై ఐదు  సంవత్సరాల కిందట నెలకొల్పిన  శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం  అధ్యాపకుల కొరతతో దాదాపు  మూసివేసే ఆలోచనలో  ప్రభుత్వం  ఉన్నట్లు అనిపిస్తుంది. చివరికి 18 నెలలుగా  ఇంచార్జి ఉపకులపతుల పాలనలో ఎక్కడ వేసిన గొంగడి  అక్కడే అన్న చందంగా  మారింది. 1260 సీట్లకు  ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే కేవలం  480 అప్లికేషన్స్ వచ్చాయి, పీజీ  కోర్సులకు  ఎంట్రన్స్ అక్కర్లేదు  ఎవరైనా  వచ్చి  చేరమని మరొక  ప్రకటన ఇచ్చారు  దాదాపు  600 పై చిలుకు  ఖాళీలకు  పదుల  సంఖ్యలో  ప్రవేశాలు  జరిగాయి.

అమెరికాలో ఒక ప్రభుత్వం గద్దె దిగగానే ప్రభుత్వంలో ఉన్న సెక్రెట్రీలు కూడా అధికారం నుంచి  తప్పుకోవడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన రిజిస్ట్రార్లు రెక్టార్లు చివరికి ఉపకులపతులు, అధికార యంత్రాంగం యూనివర్సిటీలను వదిలి వెళ్లడం జరిగింది. గతంలో వీరు రిజిస్ట్రార్, రెక్టార్, విసి , డైరెక్టర్లు కావాలంటే స్థానికంగా ఉన్న మంత్రుల కాళ్ళు పట్టుకుని అంతో ఇంతో సమర్పించుకుని వచ్చి అడ్డగోలు నియామకాలు చేపట్టి అనతికాలంలో లక్షలు గడించి కోట్లు బిల్లులు చేసి ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందో,  ఏదో సంక్షోభం ఉపద్రవం  ముంచుకొచ్చినట్లు   విధులకు  దూరంగా ఉండటం లేకపోతే  ఆరోగ్య కారణాల వల్ల విధులకు రాజీనామామా చేయడం , కేసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. వారు నిర్వహించిన నిర్వహించిన  అన్ని అడ్డగోలు నియామకాలు వాటిపై చర్యలు అన్ని ప్రశ్నార్థకంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది అనంతపురం జిల్లా ఉన్నత విద్య అభివృద్ధి ఎలా ఉందో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం చూస్తే సరిపోతుంది. విద్యార్థులు  సమస్యలతో  సతమతమవుతున్న  ఇంచార్జి వీసీ తనకు ఏమీ పట్టనట్లు నిర్లిప్త ధోరణితో మరో సంవత్సరంలో  శాస్వితంగా మూసివేతకు  గురవుతుంది.

 గత ఏడాది అధికారంలోకి  వచ్చిన  కూటమి  ప్రభుత్వం  ఆగమేఘాల మీద రాష్ట్రంలో  ఉన్న  ఉపకులపతులను  పొమ్మనలేక  పొగ పెట్టారు. గత రెండు  సంవత్సరాలుగా  ఎదుగూ బొదుగూ లేకుండా  విశ్వవిద్యాలయం ఎక్కడ వేసిన  గొంగళి అక్కడే అన్న విధంగా  మారింది.  ఏమి చేస్తున్నావ్  కోడలా అంటే  ఉలగబోసి  తీసుకుంటున్నాను అన్నట్లు ఉంది విశ్వవిద్యాలయాల  పరిస్థితి. మూడు నెలలకోసారి జరగాల్సిన  పాలకమండలి  సమావేశం పది నెలలకోసారి  జరుగుతోంది.  ఉన్నత విద్య నిధులు నిలుపుదల చేస్తామని యూజీసీ కొన్ని విశ్వవిద్యాలయాలకు  తాఖీదు ఇచ్చారు.    ఇంచార్జి  ఉపకులపతి నిర్లిప్త ధోరణి వలన  సమస్యలు  జఠిలమైపోయాయి. ప్రతి చిన్న విషయం వేచి చూసే ధోరణి.  ఇక్కడ  విద్య అభ్యసిస్తున్న  విద్యార్థులు  పెనం నుంచి  పొయ్యిలోకి  పడినట్లు భావిస్తున్నారు.   దిన దిన గండం  నూరేళ్ళాయ్యుష్షు అన్నట్లు  విశ్వవిద్యాలయ అధికారుల తీరు  విశ్వవిద్యాలయ  పురోగతికి  ప్రతిబంధకంగా  మారింది.  చిన్న  విషయాల పట్ల  నిర్ణయం  తీసుకోకుండా  దాటవేసే ధోరణి,  అనాలోచిత  నిర్ణయాలతో  విద్యార్థుల పాలిట  శాపంగా  మారుతున్నాయి.

విశ్వవిద్యాలయం అధికారుల తీరు  రోత   పుట్టిస్తున్నాయి. నవ్వి పోదురు గాక నాకేటి  సిగ్గు అన్న చందంగా విశ్వవిద్యాలయ అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడు ఏ సమస్య ముందుంచినా  నేను  ఇంచార్జి వీసీని  కొద్దికాలం ఓపిక పట్టండి శాశ్విత  విసి వస్తారు అని సెలవిస్తున్నారు.  కానీ  పేరుకే ఇంచార్జి  వీసీ చేసేవన్నీ  శాశ్విత వీసీ కంటే ఎక్కువగా చేస్తున్నారు. చదువుకున్న  మేధావులు  ఉన్న  విశ్వవిద్యాలయంలో  అర్జీ ఇస్తే  అంతే సంగతి.  వచ్చిన  అర్జీలకు  సమాధానం  చెప్పరు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు  ప్రవర్తిస్తారు.  కొన్ని  విషయాలు  నోరు మాట్లాడుతుంది  నొసలు  వెక్కిరిస్తుంది అన్న చందాన  వ్యవహరిస్తుంటారు.

 ప్రతి  విషయానికి  దాటవేసే ధోరణి  కనిపిస్తుంది.  అధికారుల  మధ్య  పాలకమండలి సభ్యుల  మధ్య  సమన్వయం లోపించి  గోటితో  పోయేదానికి  గొడ్డలి పట్టుకుంటున్నారు. ప్రభుత్వం  విశ్వవిద్యాలయాలను పటిష్టపరచడం, ఉపకులపతి  నియామకాన్ని  మరచిపోయి విశ్వవిద్యాలయాన్ని  శాశ్వితంగా మూసివేసే ఆలోచనలో  ఉన్నట్లు కనిపిస్తుంది.  మారాల్సింది అధికారుల పనితీరు  మనుషులు  కాదు.  2017, 2018 లలో జరిగిన    అడ్డగోలు  నియామకాల్లో  పోస్టులు పొందిన వారిని  తొలగించండి  అని 2022 లో హైకోర్టు తెలిపింది. ఈ నియామకాలు చేసిన ఉపకులపతులు రిజిస్ట్రార్ల పై చర్యలకు ఉపక్రమించాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి.

ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా విశ్వవిద్యాలయాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.  నాలుగు  సంవత్సరాల క్రితం   రీసెర్చ్ స్కాలర్లు సమర్పించిన థీసిస్ గ్రంథాలకు చెదలు పట్టింది కానీ వారి వైవా మోక్షంలేదు.   రౌతు మెత్తగుంటే గుఱ్ఱం మూడు కాళ్లతో పరుగెత్తింది అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. కొత్త కోర్సులకు , కొత్త కళాశాలలకు అఫిలియేషన్ కు మోక్షం లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. ఈ విద్యా సంవత్సరంలో  చాలా   విశ్వవిద్యాలయలలో కొన్ని విభాగాలు మూసి వేయక తప్పదు.  ఉన్న సీనియర్ అధ్యాపకులు రిటైర్ కావడం, గత దశాబ్ద కాలం నుండి నియామకాలు లేకపోవడం, దశాబ్ద కాలం కిందట చేరిన వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం సమస్యగా మారింది.

కొత్త నియామకాలు చేపట్టక ,రీసెర్చ్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలం వెలిబుచ్చుతున్నారు. ఇంగ్లీషు, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ , పాలిమర్ సైన్స్,  ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సెరికల్చర్, తెలుగు, హిందీ, ఇన్స్ట్రుమెంటేషన్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జియాలజీ , సోషియాలజీ, జియోగ్రఫీ,  మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ మూతపడ్డాయి.  ఇక సీనియర్ ప్రొఫెసర్లు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్  లేదు, సెమినార్ గ్రాంటు లేదు, నూతన ఆవిష్కరణలు పేటెంట్ల అంతకంటే లేవు.  వీరు రిటైర్ అయిన రోజు  ఏదో మొక్కుబడిగా ఒక కార్యక్రమం జరిపి భోజనాలు చేసి వెళ్తుంటారు.   విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు లేవు అధ్యాపకులకు బోధన సామర్థ్యాలు అంతకంటే లేవు. యాభై సంవత్సరాలు ముందు వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ స్టాఫ్ కాలేజ్ లు మూతపడి దశాబ్దం అవుతుంది.

రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవలప్మెంట్ కోర్సు అన్నీ  అనీత విద్య లాగా  టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు.  ఉన్న విశ్వవిద్యాలయాలు పటిష్టం చేయకుండా కొత్తగా క్లస్టర్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో  శంకుస్థాపన చేశారు. విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా  విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పట్టం లేదు. పరీక్షలు సకాలంలో జరపరు, ఫలితాలు వెల్లడించరు,  పిహెచ్డి వైవా జరపరు. పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలను   శాశ్వితంగా మూసివేయడం ఖాయమని పిస్తుంది. ఉర్దూ, కేంద్ర  విశ్వవిద్యాలయాలు  మొదలుపెట్టి  ఏడు    సంవత్సరాలైన నిధుల లేమితో ఎప్పుడూ స్మశాన ప్రశాంతత నెలకొంటున్నాయి.

విద్యలో నాణ్యత ఉండాలని క్వాలిటీని పెంచడానికి కొత్తగా కన్సల్టెన్సీలు ద్వారా కో ఆర్డినేటర్ల ను నియమించి ఉన్న కొద్ది మంది అధ్యాపకులతో కమ్యూనిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ ఏర్పాటు చేసి  అర్థం పర్థం లేని పనులు చేయిస్తున్నారు. కొత్త కోర్సులు  బోధించడానికి బోధకులు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు.  అధ్యాపకులకు ఓరియెంటేషన్, రిఫ్రెషర్ కోర్సులు లేవు, బోధనా నైపుణ్యాలు మెరుగుపడాలంటే బోధకులకు కొత్త అంశాల పట్ల శిక్షణ ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా మార్గదర్శి, మెటీరియల్  దొరకడం లేదు. అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు, ఓరియెంటేషన్ కోర్సులు లేక కళాశాలలో బోధన చప్పగా ఉంది. యుద్ధ ప్రాతిపదికన  విశ్వవిద్యాలయాల  ప్రక్షాళన చేయకపోతే రెండు మూడు సంవత్సరాలలో శాశ్వితంగా కనుమరుగవుతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *