– ఇంజినీర్లకు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఆదేశాలు
– నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్ అండ్ బి సీఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కృత నిశ్చయంతో ఉందని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ అన్నారు. అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ 12,14,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.1196 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి ప్రతిరోజూ నిర్మాణ పురోగతిపై మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పూర్తి నాణ్యతతో స్ట్రక్చరల్ వర్క్ పూర్తయిందని, 95% బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్ పూర్తయిందని, ఎంఈపీ 60%, ఫ్లోరింగ్, పెయింటింగ్ వర్క్స్ 50శాతం మేర పూర్తయి వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. మొత్తంగా టిమ్స్ అల్వాల్ పనులు 70% శాతం పూర్తయ్యాయని చెప్పారు. 2026 మార్చి చివరి నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను, వర్క్ ఏజెన్సీని స్పెషల్ వికాస్ రాజ్ ఆదేశించారు. ఆరోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. రెగ్యులర్ గా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, అందరూ అలెర్ట్ గా పనిచేస్తూ ప్రభుత్వా నికి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ విజిట్ లో ఆర్ అండ్ బి సీఈ లు రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, పలువురు ఈఈ, డీఈ లు ఫీల్డ్ ఇంజనీర్లు, డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



