ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 16: సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించేందుకు వొచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని… అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, సేవలపై ఆరా తీసి… యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. టెంట్ సిటీ కి సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ
కిరణ్ ఖరే, శాసన సభ్యులు మక్కన్ సింగ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ పాల్గొన్నారు.
కిరణ్ ఖరే, శాసన సభ్యులు మక్కన్ సింగ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ పాల్గొన్నారు.



